యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ: వార్తలు

25 Apr 2023

కడప

రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్ 

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ టీడీపీ నేతల ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రొద్దుటూరులో ప్రధాన కూడళ్లలో అతికించారు.

'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్ 

బీఆర్‌ఎస్‌, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన సోమవారం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు 

వైసీపీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 'మా భవిష్యతు నువ్వే జగన్' అనే ప్రచారాన్ని ప్రారంభించింది.

వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనలంగా మారాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపులో సహకరించినట్లు అనుమానిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం టీడీపీలో చేరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?

ఆంధ్రప్రదేశ్‌లోని 3 గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం), తూర్పు రాయలసీమ(ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు), పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు)పట్టభద్రల స్థానాల్లో వైసీపీ అనూహ్య పరాభవం ఎదురైంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు.

టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు

ఏలూరు జిల్లా పోలవరంలో వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు తలెత్తాయని అంబటి రాంబాబు ఆరోపించారు.