
టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఏలూరు జిల్లా పోలవరంలో వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు తలెత్తాయని అంబటి రాంబాబు ఆరోపించారు.
అందువల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైందని ఆరోపించారు. యుద్ధ ప్రాతిపదికన కాఫర్ డ్యాం ఎత్తును పెంచామని తెలిపారు. గత ప్రభుత్వం కాఫర్ డ్యాం పనులను గాలికొదిలేసిందన్నారు.
ఈ ప్రాజెక్టు వాస్తవానికి పూర్తి చేయాల్సి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయిన రాష్ట్ర నిధులు ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు
అంబటి
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పోలవరాన్ని పూర్తి చేస్తాం : అంబటి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటు పనికిరాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
నిపుణుల రిపోర్టు అనంతరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలా లేక పాతదే కొనసాగించాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఒకవేళ కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని గుర్తుచేశారు