LOADING...
SL vs ZIM: సూపర్-8కు దూసుకెళ్లిన జింబాబ్వే.. ఆసీస్‌ తర్వాత శ్రీలంకపై సంచలన గెలుపు
సూపర్-8కు దూసుకెళ్లిన జింబాబ్వే.. ఆసీస్‌ తర్వాత శ్రీలంకపై సంచలన గెలుపు

SL vs ZIM: సూపర్-8కు దూసుకెళ్లిన జింబాబ్వే.. ఆసీస్‌ తర్వాత శ్రీలంకపై సంచలన గెలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026లో గ్రూప్-బీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతుండగా, కొలంబో వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య శ్రీలంక జట్టును వారి స్వదేశంలోనే ఓడించి జింబాబ్వే గ్రూప్ టాపర్‌గా నిలవడం విశేషం. ఇప్పటికే ఆస్ట్రేలియాపై గెలిచి సూపర్-8కు అర్హత సాధించిన జింబాబ్వే, ఈ విజయంతో గ్రూప్‌లో అగ్రస్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.

Details

పాయింట్ల పట్టిక తలకిందులు

ఈ మ్యాచ్‌కు ముందు గ్రూప్-బీలో మూడు మ్యాచ్‌లు ఆడిన జింబాబ్వే 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఫిబ్రవరి 19న కొలంబోలో జరిగిన కీలక పోరులో జింబాబ్వే విజయం సాధించడంతో సమీకరణాలు మారిపోయాయి. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి జింబాబ్వే 7 పాయింట్లతో నంబర్-1 స్థానాన్ని దక్కించుకోగా, శ్రీలంక 6 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది.

Details

చారిత్రాత్మక చేజ్

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. జట్టు తరఫున పాతుమ్ నిస్సాంక 41 బంతుల్లో 62 పరుగులతో అగ్రశ్రేణి ప్రదర్శన కనబరిచాడు. పవన్ రాత్నాయక్ 44 పరుగులతో విలువైన సహకారం అందించాడు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా ఆడింది. 19.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసింది. ఐసీసీ టోర్నమెంట్‌లలో శ్రీలంకపై జింబాబ్వేకు ఇది తొలి విజయం కావడం ప్రత్యేకం. అంతేకాకుండా టీ20 అంతర్జాతీయాల్లో జింబాబ్వే సాధించిన రెండో అతిపెద్ద విజయవంతమైన రన్‌చేజ్‌గా ఈ మ్యాచ్ నిలిచింది.

Advertisement

Details

కెప్టెన్ సికందర్ రజా విజృంభణ

జింబాబ్వే విజయంలో కెప్టెన్ సికిందర్ రాజా కీలక పాత్ర పోషించాడు. అతడు కేవలం 26 బంతుల్లోనే 45 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి 173కి పైగా స్ట్రైక్‌రేట్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 48 బంతుల్లో 63 పరుగులతో అర్ధశతకం సాధించి బలమైన పునాది వేశాడు. మొత్తంగా, ఆస్ట్రేలియాపై విజయం తర్వాత శ్రీలంకను కూడా మట్టికరిపించిన జింబాబ్వే, గ్రూప్-బీలో అగ్రస్థానంతో సూపర్-8 దశలోకి దూసుకెళ్లడం టోర్నమెంట్‌లో సంచలనంగా మారింది.

Advertisement