Shai Hope: ఎస్‌ఎస్ బ్యాట్లతోనే సిక్సర్ల మోత.. సెంచరీపై విండీస్ కెప్టెన్ కామెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
రాంచీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడు రూథర్‌ఫర్డ్ కూడా దూకుడుగా ఆడటంతో వెస్టిండీస్ 249 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో విండీస్ సంచలనం సృష్టించింది. మ్యాచ్ అనంతరం షై హోప్ తన బ్యాటింగ్, ప్రస్తుత ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన వద్ద ఉన్న ఎస్‌ఎస్ బ్యాట్లన్నీ బాగుంటాయని, బంతులు బౌండరీలు దాటడానికి అదీ ఒక కారణమని సరదాగా చెప్పాడు.
వివరాలు
నా బ్యాట్లన్నీ చాలా బాగుంటాయి!
బంతులను వరుసగా బౌండరీలు దాటిస్తున్నప్పుడు తనపై తనకు ఎంత నమ్మకం ఉంటుందని అడిగిన ప్రశ్నకు షై హోప్ సరదాగా స్పందించాడు.
"నా దగ్గర ఉన్న ఎస్‌ఎస్ బ్యాట్లన్నీ చాలా బాగుంటాయని చెప్పాలి. ఇక్కడ బంతి చాలా వేగంగా బౌండరీకి వెళుతోంది. బౌండరీలు కొంచెం దూరంగా ఉన్నా మనపై మనకు నమ్మకం ఉండాలి.
మనకు అనుకూలమైన బంతి వచ్చినప్పుడు బౌండరీ సాధించేందుకు సరైన షాట్ ఎంచుకోవాలి.
ఈ రోజు అది నాకు బాగా కలిసొచ్చింది. గతంలో చెప్పినట్లుగా కొంత అదృష్టం కూడా అవసరం. ఈ రోజు అదృష్టం నా వైపు ఉంది. అందుకే సెంచరీ సాధించగలిగానని హోప్ వివరించాడు.
వివరాలు
ఇదే నా కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనా?
తన కెరీర్‌లో ఇదే అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనగా భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. దానికి సమాధానం చెప్పడం కొంచెం కష్టమని హోప్ తెలిపాడు.
పరుగులు సాధిస్తున్నప్పుడు సహజంగానే సంతోషంగా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం తన ఫామ్ బాగుందన్నారు.
తాను మ్యాచ్‌లకు ఎలా సిద్ధమవుతున్నాననే అంశంతో పాటు మానసికంగా ఉత్సాహంగా, సిద్ధంగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా మెరుగైన ప్రదర్శనకు దోహదపడుతున్నాయని అభిప్రాయపడ్డాడు.