NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్ 
    తదుపరి వార్తా కథనం
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్ 
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్

    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్ 

    వ్రాసిన వారు Stalin
    Apr 25, 2023
    06:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ టీడీపీ నేతల ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రొద్దుటూరులో ప్రధాన కూడళ్లలో అతికించారు.

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

    వివేకానంద రెడ్డి హత్య సునీత- ఏపీ సీఎం వైఎస్ జగన్ మధ్య విభేదాలు తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో కడపలో జగన్‌కు చెక్ పెట్టేందుకు సునీత రాజకీయాల్లోకి రావచ్చని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

    ఈ క్రమంలో సునీత పోస్టర్లు వెలియడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    వైఎస్

    వాల్ పోస్టర్లపై టీడీపీ నేతలు ఆగ్రహం 

    సునీత వాల్ పోస్టర్లపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్ల వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పక్కదోవ పట్టించేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఈ పోస్టర్లను అంటించారని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

    అయితే ఈ పోస్టర్లను లోతుగా పరిశీలించగా, అవి బెంగళూరులో ముద్రించినట్లు తెలింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రొద్దుటూరులోని అనేక ప్రదేశాలలో వాటిని అతికించారు.

    అయితే ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారు? సునీత రాజకీయాల్లోకి వస్తారా? లేక సునీతను కార్నర్ చేయడానికి ఎవరైనా పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనేది తేలాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కడప
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    కడప

    కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి
    పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్ పులివెందుల
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం విద్యా శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు తెలంగాణ
    దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్
    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం రైల్వే శాఖ మంత్రి

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025