YCP Incharge: వైసీపీ రెండో జాబితా విడుదల.. 27 నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పు
వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ల రెండో జాబితా కొలిక్కి వచ్చింది.మొదటి జాబితాను వైసీపీ గత నెల 11న విడుదల చేసింది. ఆరోజు నుంచి 2వజాబితాపై తర్జన భర్జన పడిన వైసీపీ పార్టీ ఎట్టకేలకు మంగళవారం వైసీపీ రెండో జాబితా విడుదల చేసింది. ఎప్పటిలాగానే ఎమ్యెల్యేను తాడేపల్లి పిలిపించి చర్చించి ఇన్ చార్జీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. కొందరు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి జగన్ అవకాశం కల్పించారు.రీజినల్ కో ఆర్డినేటర్లతో చర్చించి పలు నియోజకవర్గాల ఇన్‌చార్జీలను సీఎం జగన్ ఖరారు చేశారు. రెండవ జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.