YSRCP Third List : నేడు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో లిస్ట్
అసెంబ్లీ,ఎంపీ స్థానాలపై హైకమాండ్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల తుది జాబితా ఈరోజు(మంగళవారం) విడుదల కానుంది. ఇప్పటి వరకు 38 మంది ఇన్ ఛార్జిలను ప్రకటించగా,మరో 10 నుంచి 15 స్థానాలకు మార్పులు, చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో ఏలూరు, గుంటూరు, కర్నూలు ఎంపీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలపై సీనియర్ నేతలు కసరత్తు చేస్తున్నారు.
మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు
వైసీపీ మూడో జాబితాపై సీఎం వై.ఎస్.జగన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్లపై కూడా దృష్టి సారిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు వి.వి.వినాయక్‌ను రంగంలోకి దింపేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయి. నంద్యాల నుంచి నటుడు అలీ, కాకినాడ నుంచి సునీల్ చలమలశెట్టి, విజయనగరం నుంచి చిన్న శీను, అనకాపల్లి నుంచి కరణం ధర్మశ్రీ పోటీ చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి.