
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు.
ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేసిటనట్లు టీడీపీ సభ్యులు ఆరోపించారు.
తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు డోల బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ సభ్యులు దాడి చేసినట్లు టీడీపీ చెప్పడంతో సభలో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పీకర్ తెలుగుదేశం పార్టీ సభ్యులపై ఒకరోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు.
ఆంధ్రప్రదేశ్
వీరాంజనేయస్వామి నాపై దాడి చేశారు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు
అసెంబ్లీలో జరిగిన గందగోళంపై వైసీపీ కూడా ఘాటు స్పందించింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడంతో ఆయనకు రక్షణగా తాము వెళ్లినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ క్రమంలో తమపై టీడీపీ సభ్యులు దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు.
డోల బాల వీరాంజనేయస్వామి తనపై దాడి చేసినట్లు సుధాకర్ బాబు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై డోలా ధూషణలు చేసినట్లు చెప్పారు.
గొడవ చేయొద్దని వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను బచ్చయ్య చౌదరి నెట్టివేసినట్లు సుధాకర్ బాబు పేర్కొన్నారు.