Page Loader
దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

వ్రాసిన వారు Stalin
Mar 16, 2023
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం పాలసీ కేసు విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఈ కేసులో విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు పంపింది. దిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ప్రస్తుతం మాగుంట రాఘవ తీహారు జైలులో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఈనెల 18న ఈడీ ఎదుట హాజరు‌కానున్న మాగుంట

దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ నిమిత్తం ఈనెల 18న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దిల్లీలో మద్యం వ్యాపారానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిశారని ఈడీ పేర్కొంది. ఈడీ ఇప్పటి వరకు ఈ కేసులో రెండు ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు అరెస్టు అయ్యారు. ఇదిలా ఉంటే.. గురువారం విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కాకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.