కవితకు మళ్లీ నోటీసులు పంపిన ఈడీ; ఈనెల 20న విచారణ
దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 20న తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. వాస్తవానికి గురువారం కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కవిత హాజరు కాలేదు. విచారణకు వెళ్లే కొద్ది నిమిషాల ముందు ట్విస్ట్ ఇచ్చారు. తాను గురువారం విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. లేఖను ఈ మెయిల్ ద్వారా ఈడీ ఆఫీస్‌కు పంపారు.
తదుపరి విచారణకు కవిత హాజరవుతారా?
విచారణకు అవసరమైన డాక్యుమెంట్లను తన న్యాయవాది భరత్ ద్వారా కవిత పంపారు. అలాగే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కవిత చెప్పడంతో.. ఈడీ గురువారం విచరాణను వాయిదా వేసింది. 20వ తేదీన విచారణకు రావాలని నోటీసులు పంపింది. దిల్లీ మద్యం పాలసీ కేసు విచారణకు సంబంధించి కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 24న విచారణకు రానుంది. ఈక్రమంలో ఈడీ తదుపరి వాయిదా 20వ తేదీన ఉండటంతో మరి కవిత వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి