Page Loader
చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ
విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాసిన కవిత

చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ

వ్రాసిన వారు Stalin
Mar 16, 2023
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం పాలసీ కేసులో మరికొద్ది సేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరు హాజరు కావాల్సిన భారత రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. తాను గురువారం విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. లేఖను ఈ మెయిల్ ద్వారా ఈడీ ఆఫీస్‌కు పంపారు. అలాగే తాను అనారోగ్యంగా కూడా ఉన్నట్లు ఆ లేఖలో వివరించారు. విచారణకు అవసరమైన డాక్యుమెంట్లను పంపుతానని తన న్యాయవాది ద్వారా పంపుతున్నట్లు లేఖలో కవిత పేర్కొన్నారు.

కవిత

మార్చి 24న కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ బుధవారం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళను విచారించడానికి ఈడీ ఆఫీస్‌కు పిలవడంపై కవిత పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత పిటిషన్‌ను మార్చి 24న విచారించేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించాలని ఈడీ భావిస్తోందని, అయితే ఈడీ ఆ పని చేయలేదని కవిత తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.