Page Loader
YSRCP: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ 
YSRCP: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

YSRCP: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 08, 2024
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ పార్టీ ప్రకటించింది. వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు పేర్లను ఖరారు చేసింది. ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈసారి ఎన్నికలల్లో బాబూరావుకు ఎమ్యెల్యే టికెట్ లేదని పార్టీ అధిష్టానం తెలియజేసింది. దానికి బదులుగా రాజ్యసభకు పంపిస్తామని పార్టీ పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈమేరకు రాజ్యసభకు వైసీపీ తరుపున పోటీ చెయ్యడానికి బాబురావును ఎంపిక చేశారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ