
Alla Ramakrishna Reddy: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి వస్తున్నారంటూ మీడియాలో వస్తున్నాయి.
ఆ వార్తలను నిజం చేస్తూ.. మంగళవారం సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గత డిసెంబర్‌లో రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీని వీడిన సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
నియోజకవర్గానికి నిధులు కూడా విడుదల చేయడం లేదని ఆరోపించారు. వైఎస్ షర్మిలతో కలిసి నడిచేందుకు ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.
ఈ క్రమంలో కాంగ్రెస్‌లో ఇమడలేక ఆర్కే మళ్లీ వైసీపీలోకి రావడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైసీపీలో చేరుతున్న ఆర్కే
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. తిరిగి @YSRCPartyలో జాయిన్ అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.#YSRCP #YSJaganAgain pic.twitter.com/UUmbcgWeJL
— YSR Congress Party (@YSRCParty) February 20, 2024