ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 'మా భవిష్యతు నువ్వే జగన్' అనే ప్రచారాన్ని ప్రారంభించింది.
ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందిన ఇంటింటికి వెళ్లి వైసీపీ శ్రేణులు 'మా నమ్మకం నువ్వే జగన్' నినాదం ఉన్న స్టిక్కర్లను పంపిణీ చేశారు.
అయితే ఈ ప్రచారానికి ప్రజల స్పందన మిశ్రమంగా ఉందని ప్రతిపక్ష పార్టీలైన జనసేన, టీడీపీ విమర్శిస్తున్నాయి.
ఇంకో వైపు స్టిక్కర్ ప్రచారంపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని వైసీపీ శ్రేణులు సంతోషంతో ఉన్నారు.
ఇదిలా ఉంటే, రెండు రోజుల క్రితం వైసీపీ పంపిణీ చేసిన 'మా భవిష్యతు నువ్వే జగన్' స్టిక్కర్‌ను కుక్క తొలగిస్తున్న వీడియో వైరల్ అయ్యింది.
వైసీపీని ట్రోల్ చేయడానికి టీడీపీ ఈ వీడియోను ఉపయోగించుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్
పోలీసులు కేసు నమోదు చేశారా?
ఇప్పటికే ఈ వీడియోను సోషల్ మీడియాలో విపతంగా ట్రోల్ చేసిన టీడీపీ, తాజాగా కుక్కపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ చర్య తమ ప్రియతమ నేత సీఎం జగన్‌ను అవమానించడమేనని స్థానిక టీడీపీ మహిళా నేత ఒకరు వ్యాఖ్యానించారు.
2019 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విశేషమైన మార్పు తీసుకొచ్చిన సీఎం జగన్ స్టిక్కర్‌ను తొలగించిన కుక్కపై ఫిర్యాదు చేసేందుకు తాము పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు నాయుకులు పేర్కొన్నారు.
ఈ వీడియో ఆధారంగా వైసీపీని టీడీపీ నిర్ధాక్షిణ్యంగా ట్రోల్ చేస్తోంది.
అయితే టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీడీపీ వైరల్ చేస్తున్న వీడియో ఇదే
In a bizarre incident, a police complaint by a group of women has been filed against a dog for tearing a poster of #AndhraPradesh CM Y. S. Jagan Mohan Reddy.#YSJagan pic.twitter.com/U7vbqkWO9n
— IANS (@ians_india) April 13, 2023