తదుపరి వార్తా కథనం
Polavaram Project: రాజీవ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు పర్యటన
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 11, 2025
12:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర పార్లమెంటరీ కమిటీ పోలవరం ప్రాజెక్టును ఇవాళ సందర్శించింది. 10 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది.
కమిటీ ఛైర్మన్ రాజీవ్ ప్రతాప్ సింగ్ రూఢీ నేతృత్వంలో కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, స్పిల్ వే, ఛానల్స్ వంటి కీలక నిర్మాణాలను కమిటీ పరిశీలించనుంది.
ఈ సందర్శన అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులతో సమావేశమై నిర్మాణ తీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.
సమీక్ష అనంతరం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనుల పురోగతి, సవాళ్లు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.