
పోలవరం జలాశయంలో కుంగిన స్పిల్ వే గైడ్ బండ్... హుటాహుటిన సీడబ్ల్యూసీ సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి నీటిని స్పిల్ వేలోకి మళ్లించేందుకు ఉపయోగించే గైడ్ బండ్ కు పగుళ్లు ఏర్పడి నెర్రలు బాసింది. గ్రావిటీ మీదుగా నీటి విడుదలకు సమాయత్తమవుతున్న క్రమంలో గైడ్ బండ్ కుంగిపోవడంపై అధికారుల్లో టెన్షన్ రేపుతోంది.
పోలవరంలో గోదావరి నుంచి వచ్చే ప్రవాహాన్ని కుడివైపునకు మళ్లించే స్పిల్ వేకు ఎగువ ఎడమ వైపున కడుతున్న గైడ్‌బండ్ కాస్త కుంగిపోయింది. నీటి ఉద్ధృతిని తట్టుకునేలా స్పిల్ వే మీదుగా ప్రవాహాన్ని దిగువకు మళ్లించేందుకు నది ఉపరితలం నుంచి 26 మీటర్ల ఎత్తు, 500 మీటర్ల పొడవుతో భారీ కట్ట పోశారు.
ప్రధాన ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్‌కు, స్పిల్ మధ్యలో నిర్మాణం పూర్తి కావొచ్చిన నేపథ్యంలో ఇప్పుడిలా గైడ్‌బండ్ కు పగుళ్లు రావడంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
asas
పోలవరాన్ని వెంటనే సందర్శించాలి.. సీడబ్ల్యూసీ ఆదేశాలు
డ్యామ్ అధికారులు మాటేంటి :
గైడ్‌బండ్‌లో భాగంగా నిర్మించిన కట్ట సహా అందులోని రాళ్లు దిగువకు దిగిపోయాయి. ఫలితంగా రిటైనింగ్ వాల్ సైతం కుంగిపోయింది. కటాఫ్ సరిగ్గా లేనందువల్లే గైడ్‌బండ్ కుంగిందని ఇంజినీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే శుక్ర, శనివారాల్లో గైడ్‌బండ్‌లో అక్కడక్కడా పగుళ్లు రాగా, ఆదివారం నాటికి కట్ట పూర్తిగా కుంగుబాటుకు గురైందని భావిస్తున్నారు.
సీడబ్ల్యూసీ రివ్యూ...
గైడ్‌బండ్ కుంగిన సమాచారం అందగానే సోమవారం సీడబ్ల్యూసీ ఛైర్మన్ ఖుష్విందర్ వోహ్రా, ఇంజినీర్ ఇన్ చీఫ్, సీఈ ఎస్‌ఈ సహా ఇతర నిపుణులతో రివ్యూ చేపట్టారు.
మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డిజైన్ నిపుణులు పోలవరాన్ని సందర్శించాలని ఆదేశించారు. అనంతరం గైడ్‌బండ్ కుంగేందుకు గల కారణాలను అన్వేశించి, విశ్లేషించాలని ఛైర్మన్ స్పష్టం చేశారు.