Page Loader
Chandrababu: పోలవరం, బనకచర్లపై చర్చలు.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ
పోలవరం, బనకచర్లపై చర్చలు.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ

Chandrababu: పోలవరం, బనకచర్లపై చర్చలు.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2025
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం న్యూఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్‌తో భేటీ అయిన ఆయన, రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత గల పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు టీడీపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం తరువాత మాత్రం మరింత కీలక భేటీలకు సీఎం సిద్ధమవుతున్నారు.

Details

రాజ్యసభ స్థానం అభ్యర్థి ఎంపికపై కసరత్తు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌లతో ఆయ‌న ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశముంది. ఇక మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రానుండటంతో ఆ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చంద్రబాబు - అమిత్ షా మధ్య చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో పర్యటన కార్యక్రమాలు, భద్రతా అంశాలపై స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం అభ్యర్థి ఎంపిక అంశం కూడా అధికార పక్షంలో చర్చకు వస్తున్నట్లు సమాచారం.