కేంద్రమంత్రి: వార్తలు

06 Jun 2023

పోలవరం

ఏపీ పోలవరానికి నిధుల ప్రవాహం... అదనంగా రూ.12,911 కోట్లు శాంక్షన్

పోలవరం నేషనల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కు అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

NIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్ 2023ని విద్య, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌‌కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు.

ప్రజారోగ్యానికి హాని కలగొచ్చు.. అందుకే ఈ కాంబో ఔషధాలు బ్యాన్ : కేంద్రం

దేశప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సుమారు 14 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ ( ఎఫ్.డి.సీ ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. ఆయా ఔషధాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంది.

భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు

గడిచిన 24 గంటల్లో భారత్ లో 237 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా నాలుగు మరణాలు సంభవించాయి. శక్రవారం నాటి కేసులతో పోలిస్తే 7.2 శాతం కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్

ఎడ్యూకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌, డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదా పొందేందుకు కేంద్రం కొత్త నిబంధనలను రూపొందించింది.

29 May 2023

గేమ్

మొబైల్ గేమర్లకు గుడ్ న్యూస్.. ఇండియాలోకి BGMI గేమ్ రీ ఎంట్రీ

ప్రముఖ మల్టీ ప్లేయర్ షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భారత్ లోకి తిరిగి ప్రవేశించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది.

కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం 

కేంద్ర మంత్రి వర్గంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం న్యాయ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘవాల్‌ను ప్రభుత్వం నియమించింది.

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో బాధపడుతూ ఆదివారం రాత్రి దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని క్రిటికల్ కార్డియాక్ యూనిట్‌లో చేరినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు.

'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్

స్వలింగ సంపర్కుల వివాహంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాల విషయం అనేది దేశ ప్రజల విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం అని కిరెన్ రిజిజు అన్నారు.

కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం

50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)పై 4% పెంపుదలని షెడ్యూల్ క్యాబినెట్ సమావేశంలో కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది, అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక నోటీసును జారీ చేయలేదు.

కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం

రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ(MRTH) జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై వేగ పరిమితులను పెంచాలని ప్రతిపాదించింది. ప్రతిపాదిత స్పీడ్ రివిజన్ భారతదేశ రవాణా మౌలిక సదుపాయాల భద్రతా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం.

24 Feb 2023

కోవిడ్

మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది'

కరోనా సమయంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని కేంద్ర ఆరోగ్య‌మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల కోవిడ్ సమయంలో దేశంలో 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు ఆయన చెప్పారు.

కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14ని సంప్రదాయబద్ధంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే తేదీని కౌ హగ్ డేగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.

2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులైన వారం తర్వాత, కేంద్రం ఈరోజు మరో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను అత్యున్నత న్యాయస్థానానికి పెంచింది, ఇప్పుడు పూర్తి స్థాయి 34 మంది న్యాయమూర్తుల సంఖ్యకు చేరుకుంది.

04 Feb 2023

కర్ణాటక

బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను, కో-ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలైని అధిష్టానం నియమించింది.

06 Jan 2023

బీజేపీ

తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్లుగా తెలంగాణలో కాస్త పుంజుకున్నా.. ఏపీలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న కేంద్ర‌మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఏపీకి ప్రాధాన్యత కల్పించొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.