Page Loader
Snow leopards: దేశంలో 718 మంచు చిరుతలు: శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడి 
Snow leopards: దేశంలో 718 మంచు చిరుతలు: శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడి

Snow leopards: దేశంలో 718 మంచు చిరుతలు: శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడి 

వ్రాసిన వారు Stalin
Jan 30, 2024
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని మంచు చిరుతలపై కేంద్రం ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించింది. దేశంలో 718 మంచు చిరుతలు ఉన్నట్లు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ-WII) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దిల్లీలో మంగళవారం జరిగిన జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ నివేదికను విడుదల చేశారు. దేశంలో మంచు చిరుత జనాభా అంచనా (SPAI) కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్, మైసూరు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా మద్దతుతో డబ్ల్యూఐఐ ఈ సర్వేను నిర్వహించింది.

దిల్లీ

లద్ధాఖ్‌లో అత్యధిక మంచు చిరతలు

లద్ధాఖ్‌లో 477, ఉత్తరాఖండ్‌లో 124, హిమాచల్ ప్రదేశ్‌లో 51, అరుణాచల్ ప్రదేశ్‌లో 36, సిక్కింలో 21, జమ్మకశ్మీర్‌లో 9 మంచు చిరుతలు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. లద్ధాఖ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో సహా ట్రాన్స్-హిమాలయన్ ప్రాంతం అంతటా సుమారు 1,20,000కి.మీ విస్తీర్ణంలో మంచు చిరుతలు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. 2019-2023 వరకు రెండు దశంలో విశ్లేషించి మంచు చిరుతల జనాభాను లెక్కించినట్లు చెప్పింది. మంచు చిరుత సంకేతాలను రికార్డ్ చేయడానికి 13,450 కి.మీ ట్రయల్స్ సర్వే చేయబడ్డాయి. 1,971 ప్రదేశాల్లో కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కేంద్రం వివరించింది. అందులో 180,000 ట్రాప్ చిత్రాలను విశ్లేషించి మంచు చిరుతల సంఖలపై ఒక అంచనాకు వచ్చినట్లు వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నివేదికను విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి