Goa: గోవా విహారయాత్రలో తీవ్ర విషాదం.. అద్దె థార్ ఢీకొని కారులోని 65 ఏళ్ల పర్యాటకుడి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
గోవా విహారయాత్ర ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ఉత్తర గోవాలో సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌కు చెందిన 65 ఏళ్ల పర్యాటకుడు దుర్మరణం పాలయ్యారు. అతివేగంగా దూసుకొచ్చిన అద్దె థార్ వాహనం,వారు ప్రయాణిస్తున్న హ్యుందాయ్ ఐ20 కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు భగత్ రామ్ శర్మ (65)కుటుంబ సభ్యులతో కలిసి గోవాకు టూర్‌కు వచ్చారు. సోమవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఐ20 కారులో వెళ్తుండగా,అస్సాగావ్‌లోని'హ్యాపీ బార్ జంక్షన్'వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన థార్ కారు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రత ఎక్కువగా ఉండటంతో భగత్ రామ్ శర్మకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై ఢిల్లీ యువకుడిపై పోలీసుల కేసు నమోదు
కారులో ఉన్న మరో మహిళకు గాయాలు కాగా, ఒక చిన్నారి మాత్రం సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఘటనపై అంజునా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా,వేగంగా వాహనం నడిపి మరణానికి కారణమయ్యారన్న అభియోగాలపై ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల యువకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన థార్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
వివరాలు
ప్రమాద సమయంలో మహిళ డ్రైవింగ్ చేసిందన్న ప్రత్యక్ష సాక్షులు
ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన సమయంలో థార్‌ను ఒక మహిళ నడుపుతోందని, ఆమెనే వేగంగా వచ్చి ఢీకొట్టిందని ఒక ప్రత్యక్ష సాక్షి ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె పక్క సీటులోకి మారి, కారులో ఉన్న యువకుడు డ్రైవర్ స్థానంలో కూర్చున్నాడని పోలీసులకు వివరించినట్లు తెలిసింది. దీంతో అసలు ప్రమాద సమయంలో వాహనం నడిపింది ఎవరు అనే అంశంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అద్దె వాహనాల వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గోవాలో ఘోర ప్రమాదం..
Goa Car Accident : 'बाबा, मी होतो पण... ' गोव्यात रेंटवर घेतलेल्या थारची i20 ला जोरदार धडक, भोपाळच्या पर्यटकाचा मृत्यूhttps://t.co/NPtGRmW0Kt#GoaCarAccident #Thar #i2o #Accident #Goa
— ZEE २४ तास (@zee24taasnews) February 25, 2026