Trump: అమెరికాలో స్వర్ణయుగం.. దేశం మరింత బలంగా మారింది: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని.. గతంతో పోలిస్తే మరింత శక్తివంతమైన దేశంగా ఎదిగిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు. అమెరికాలో ప్రతి ఏడాది అధ్యక్షుడు దేశ పరిస్థితులపై చేసే అధికారిక ప్రసంగాన్నే స్టేట్ ఆఫ్ ది యూనియన్‌గా పిలుస్తారు. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ II, సెక్షన్ 3 ప్రకారం దేశ స్థితిగతులపై అధ్యక్షుడు నిర్దిష్ట కాల వ్యవధిలో కాంగ్రెస్‌కు నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
వివరాలు
3 నెలల్లో ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకుంది
గత తొమ్మిది నెలలుగా అక్రమంగా విదేశీయులు అమెరికాలోకి ప్రవేశించిన ఘటనలు లేవని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం మూడు నెలల్లోనే గణనీయంగా పుంజుకుందని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. బైడెన్ హయాంలో దేశ చరిత్రలోనే అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైందని విమర్శించారు. అయితే తన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాది వ్యవధిలో ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా నియంత్రించగలిగామని వెల్లడించారు. గత డిసెంబర్ చివరి నాటికి ద్రవ్యోల్బణం 1.7 శాతానికి పడిపోయిందని వివరించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అమెరికన్లు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారని ట్రంప్ స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో మాట్లాడుతున్న ట్రంప్
President Donald J. Trump’s 2026 State of the Union Address https://t.co/UqD2fvZOWV
— The White House (@WhiteHouse) February 25, 2026