భూపేంద్ర యాదవ్: వార్తలు

మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుతపులి 4 పిల్లలకు జన్మనిచ్చింది. కిడ్నీ వ్యాధితో ఒక చిరుత మరణించిన మూడు రోజుల తర్వాత మరో చిరుత 4 బుల్లి చిరుతలకు జన్మనిచ్చినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అతను చిరుత పిల్లల చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు

దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల పంచాయితీని కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జగన్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు.