Kuno National Park: వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చిరుత
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఆడ చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఇదే విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు."కునో కొత్త పిల్లలు! జ్వాలా అనే నమీబియా చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. నమీబియా చిరుత ఆషా తన పిల్లలకు జన్మనిచ్చిన కొద్ది వారాలకే జ్వాలా జన్మనిచ్చిందని " అని యాదవ్ ట్వీట్ చేశారు. "దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వన్యప్రాణుల ఫ్రంట్‌లైన్ యోధులు, వన్యప్రాణుల ప్రేమికులకు అభినందనలు. భారత్ వన్యప్రాణులు వృద్ధి చెందుతాయి...,"రాసుకొచ్చారు. అప్పుడే పుట్టిన చిరుతల వీడియోను కూడా మంత్రి పోస్ట్ చేశారు.
10 చిరుతలు మృతి
జనవరి 16న కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుత శౌర్య మరణించిన కొన్ని రోజుల తర్వాత ఇది జరిగింది. 2022లో భారతదేశంలో ఆఫ్రికన్ చిరుతలను తిరిగి ప్రవేశపెట్టినప్పటి నుండి 10 చిరుతలు మరణించాయి. చిరుతల మరణానికి ఖచ్చితమైన కారణం వెంటనే తెలియరాలేదని,పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుందని అటవీ శాఖ తెలిపింది. మగ చిరుత సరిగ్గా నడవడం లేదని ట్రాకింగ్ టీమ్ గుర్తించింది, ఆ తర్వాత దానిని ప్రశాంతపరిచి, పిల్లి జాతిని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు, కానీ అవి విఫలమయ్యాయి. అంతకుముందు జనవరి 3న కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. చిరుత ప్రాజెక్ట్ కింద, తల్లి చిరుత జ్వాలాతో సహా 8 చిరుతలను సెప్టెంబర్ 17, 2022న నమీబియా నుండి తీసుకువచ్చారు.