తదుపరి వార్తా కథనం

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక
వ్రాసిన వారు
Stalin
May 01, 2023
10:05 am
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో బాధపడుతూ ఆదివారం రాత్రి దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని క్రిటికల్ కార్డియాక్ యూనిట్‌లో చేరినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
కిషన్ రెడ్డి ఆదివారం రాత్రి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఛాతీలో నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఎయిమ్స్‌లోని సీసీయూలో చేర్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అయితే కిషన్ రెడ్డి ఆరోగ్యం ఎలా ఉందనే దానిపై ఇంకా పూర్తిస్థాయిలో సమచారం తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కిషన్ రెడ్డి అనారోగ్యంపై ఏఎన్ఐ కథనం
G Kishan Reddy complains of chest tightness, admitted to AIIMS Delhi
— ANI Digital (@ani_digital) May 1, 2023
Read @ANI Story | https://t.co/bOMOnDtFU1#GKishanReddy #AIIMSDelhi pic.twitter.com/xwupPk9ZR3