ఖలిస్థానీ: వార్తలు

24 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే!

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోవడంలో ఎందుకు జాప్యం చేశారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మార్చి 18నే అతన్ని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నాయి.

23 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 

పంజాబ్ పోలీసులను ఇన్ని రోజులు ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్ సింగ్ ఆదివారం అరెస్టు అయ్యారు.

23 Apr 2023

పంజాబ్

ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ 

'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

20 Apr 2023

పంజాబ్

లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అమెను అదుపులోకి తీసుకున్నారు.

14 Apr 2023

పంజాబ్

అమృత్‌సర్‌కు అమృత్‌పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు

పంజాబ్‌ నూతన సంవత్సరం 'బైసాఖి' వేడుకలు శుక్రవారం ప్రారంభం కానున్న నేఫథ్యంలో ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌‌ అమృత్‌సర్ లేదా తల్వాండి సాబోను సందర్శించవచ్చని ప్రచారం జరుగుతోంది.

11 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్! 

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిఘా వ్యవస్థల కళ్లు గప్పి అతను ఎలా తప్పించుకుంటున్నాడు? అతను అసలు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలను అమృత్‌పాల్ సింగ్‌ సలహాదారుగా చెప్పుకునే పాపల్‌ప్రీత్ సింగ్‌‌ పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

10 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్ 

ఖలిస్థానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను సోమవారం పంజాబ్ పోలీసులు, పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.

29 Mar 2023

పంజాబ్

పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా?

గత 10 రోజులుగా పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు అతను గోల్డెన్ టెంపుల్‌లో పోలీసులకు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

28 Mar 2023

దిల్లీ

దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; తలపాగా లేకుండా కళ్లద్దాలు, డెనిమ్ జాకెట్‌తో దర్శనం

పంజాబ్ నుంచి పారిపోయి వారం రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ దిల్లీలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు.

28 Mar 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు

అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. అమృత్‌పాల్ సింగ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు స్పష్టమైన ఆధారాలను సేకరించారు.

25 Mar 2023

అమెరికా

శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం ప్రవాస భారతీయులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కాన్సులేట్‌ భవనం వెలుపల గుమిగూడి భారత్‌కు సంఘీభావంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.

24 Mar 2023

పంజాబ్

భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు

పరారీలో ఉన్న 'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ గురించి తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.

23 Mar 2023

పంజాబ్

బైక్‌పై వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటో వైరల్; అతని భార్యను ప్రశ్నించిన పోలీసులు

ఖలిస్తానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కొత్త ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అతను మూడు చక్రాల బండిపై మోటారుసైకిల్, డ్రైవర్ కాకుండా మరొక వ్యక్తితో కనిపించాడు.

22 Mar 2023

పంజాబ్

గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్

ఖలిస్థానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌కు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు శనివారం ఆపరేషన్‌ను ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయన ఓ గురుద్వారాకు వెళ్లి 45నిమిషాలు గడిపిన విషయం తాజాగా బయటికి వచ్చింది.

22 Mar 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు

'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ కోసం పంజాబ్ పోలీసులు ఏడు రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నారు. అయినా ఇంతవరకు ఆయన ఆచూకీని కనుగోనలేకపోయారు.

అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు

ఖలిస్థానీ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్‌కు కోసం పంజాబ్ పోలీలులు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నాలుగు రోజులుగా అమృతపాల్ సింగ్‌ కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో అమృతపాల్‌కు మద్దతుగా ఖలిస్థానీ సానుభూతిపరులు వివిధ దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు.

20 Mar 2023

పంజాబ్

'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు

'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే అమృతపాల్ సింగ్‌ వేటలో పోలీసులకు లభిస్తున్న ఆధారాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.

20 Mar 2023

బ్రిటన్

లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం

ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ అరెస్టు కోసం పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన గాలింపునకు నిరసనగా లండన్‌లో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్థానీ మద్దతుదారులు వీరంగం సృష్టించారు.