
SFJ బెదిరింపు తర్వాత.. ఎయిర్ ఇండియా విమానాలకు భద్రత పెంచాలని కెనడాను కోరిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఖలిస్థానీ టెర్రర్ గ్రూప్ సిక్కుస్ ఫర్ జస్టిస్(SFJ) బెదిరింపుల నేపథ్యంలో ఎయిర్‌లైన్‌లో భద్రతను పెంచాలని కోరుతూ కెనడా అధికారులను ఆశ్రయించినట్లు భారత హైకమిషన్ ఆదివారం తెలిపింది.
కెనడాలోని టొరంటో, వాంకోవర్ నగరాలకు దిల్లీ మధ్య ఎయిర్ ఇండియా అనేక వారాంతపు విమానాలను నడుపుతుంతోంది.
ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. దిల్లీ నుంచే కెనడాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించిన ముప్పును ఆ దేశ అధికారుల ఎదుట లేవనెత్తినట్లు పేర్కొన్నారు.
భారత్-కెనడా మధ్య ద్వైపాక్షిక పౌర విమానయాన ఒప్పందంలో ఇటువంటి (బెదిరింపులు) బెదిరింపులను ఎదుర్కోవటానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని సంజయ్ కుమార్ వర్మ చెప్పారు.
కెనడా
SFJ చీఫ్ వీడియోల ఏమని బెదరించాడంటే!
ఖలిస్థానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్-కెనడా సంబంధాలలో కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో SJF చీఫ్ గురుపత్వంత్ పన్ను శనివారం ఒక వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో అతను పంజాబీ సిక్కులను హెచ్చరించాడు. నవంబర్ 19 తర్వాత మీ ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని హెచ్చరించాడు.
ఈ సమయంలో వాంకోవర్ నుంచి లండన్‌కు వెళ్లే విమానయాన సంస్థపై 'గ్లోబల్ దిగ్బంధనం'కు గురుపత్వంత్ పన్ను పిలుపునిచ్చారు.
దీంతో ఎయిర్ ఇండియాలో వెళ్లే ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో భారత్ చొరవ తీసుకొని, కెనడా అధికారులతో మాట్లాడింది.