Page Loader
అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు
అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు

అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు

వ్రాసిన వారు Stalin
Mar 28, 2023
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. అమృత్‌పాల్ సింగ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు స్పష్టమైన ఆధారాలను సేకరించారు. అమృత్‌పాల్ సింగ్ ఫైనాన్షియర్ దల్జీత్ కల్సీ పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కుమారుడికి సన్నిహితుడని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. దుబాయ్‌కి చెందిన సాద్ బజ్వా కంపెనీతో కల్సికి సంబంధం ఉందని అధికారులు తెలిపారు. రెండు నెలలు అతడు దుబాయ్‌లోనే ఉంటున్నట్లు వెల్లడించారు. కల్సి దుబాయ్‌లో ఉండేందుకు ఖలిస్తానీ వేర్పాటువాది లాండా హరికే ఏర్పాట్లు చేసినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

పంజాబ్

పంజాబ్‌ను మతపరంగా విభజించడానికి పాకిస్థాన్ నుంచి అమృత్‌పాల్‌కు ఆయుధాలు

కల్సి పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స(ఐఎస్ఐ)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్‌ బాంబిహా గ్యాంగ్‌తో కల్సికి సత్ససంబధాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానియాకు కల్సి సన్నిహితుడని పేర్కొన్నారు. కల్సి కొంతకాలం క్రితం దిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, పంజాబ్‌లో మోడలింగ్, సినిమా కాంట్రాక్ట్‌లకు ఏజెంట్‌గా పనిచేశాడు. 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి వెతుకున్నారు. అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌ను మతపరమైన మార్గాల్లో విభజించడానికి ప్రయత్నించడానికి ఐఎస్ఐ ద్వారా పాకిస్థాన్ నుంచి ఆయుధాలను సమకూర్చుకోవడంతో సహా అనేక రకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలల్లో పాల్గొన్నట్లు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.