Page Loader
భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు
భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు

భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు

వ్రాసిన వారు Stalin
Mar 24, 2023
06:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పరారీలో ఉన్న 'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ గురించి తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా అమృత్‌పాల్ సింగ్ తన భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను బందీగా ఉంచి తరచూ కొట్టేవాడని నిఘా వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. అమృత్‌పాల్‌కు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అమృత్‌పాల్‌‌కు అమ్మాయిల మోజు ఎక్కువని, అతనికి థాయ్‌లాండ్‌లో గర్ల్‌ఫ్రెండ్ ఉందని, ఆమెను రెండో పెళ్లి చేసుకున్నట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. అమృత్‌పాల్‌కోసం పంజాబ్ పోలీసుల వేట ఏడు రోజులుగా సాగుతోంది. అయినా అతని ఆచూకీ ఇంతవరకు పోలీసులు కనుక్కోలేకపోయారు. మాదక ద్రవ్యాలు, హింసను వ్యాప్తి చేయడానికి భారతదేశానికి పాకిస్థాన్ ఐఎస్ఐ పంపిన ఏజెంట్ అని ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు.

అమృత్‌పాల్ సింగ్

అమృత్‌పాల్‌ సిక్కు మత సిద్ధాంతాలను అనుసరించలేదు: నిఘా వర్గాలు

'వారిస్ పంజాబ్ దే'కు వచ్చే విదేశీ నిధులకు సంబంధించి కౌర్‌ను విచారించిన సమయంలో అమృత్‌పాల్‌ ఆమెను తరుచూ కొట్టే విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. థాయ్ లాండ్ అమ్మాయి విషయం కూడా అధికారులకు కౌర్‌ చెప్పినట్లు సమచారు. అందుకే 'వారిస్ పంజాబ్ దే'కు వచ్చే విదేశీ నిధులకు థాయ్‌లాండ్ కనెక్షన్‌పై కూడా నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అమృత్‌పాల్‌ సిక్కు మత సిద్ధాంతాలను అనుసరించలేదని పేర్కొన్నాయి. అమృత్‌పాల్‌‌కు దుబాయ్‌లోని డ్రగ్స్ డీలర్‌లతో సంబంధాలు ఉన్నాయని, అతని సోదరుడు జస్వంత్‌తో సహా పాకిస్థాన్ నుంచి పనిచేస్తున్నారని అధికారులు చెప్పారు. సింగ్ తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి తన గతం గురించి చాలా తక్కువగా తెలిసేలా జాగ్రత్త పడ్డాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమృత్‌పాల్ తన సొంత సైన్యానికి శిక్షణ ఇస్తున్నట్లు బయటకు వచ్చిన వీడియోలు