గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్
ఈ వార్తాకథనం ఏంటి
ఖలిస్థానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌కు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు శనివారం ఆపరేషన్‌ను ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయన ఓ గురుద్వారాకు వెళ్లి 45నిమిషాలు గడిపిన విషయం తాజాగా బయటికి వచ్చింది.
నంగల్ అంబియన్ గురుద్వారాకు శనివారం మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన అమృత్‌పాల్ అక్కడే 1:45గంటల వరకు ఉన్నాడు. ఇదే విషయాన్ని గురుద్వారా పూజారి రంజిత్ సింగ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు.
అమృత్ పాల్, అతని సహచరులు వచ్చినప్పుడు వారు గొడవ సృష్టించడానికి వచ్చారని భావించినట్లు పూజారి చెప్పారు.
వారు తమకు కొన్ని బట్టలు అవసరమని ఒక కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
పంజాబ్
అమృత్‌పాల్ నన్ను ఫోన్ అడిగాడు: గురుద్వారా పూజారి
అమృత్‌పాల్‌తో వచ్చిన వారు బట్టలు అడిగేసరికి తాను ఆశ్చర్యపోయానని, వారు చెప్పినట్లుగానే తాను చేసినట్లు పూజారి రంజిత్ సింగ్ వెల్లడించారు. తన కొడుకు బట్టలు ఇచ్చిటనట్లు చెప్పారు. అమృత్‌పాల్ అందులో నుంచి ఒక జత తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఆ సమయంలో అమృత్‌పాల్ మనుషులు ఫోన్‌లో పరిస్థితిపై ఆరా తీసినట్లు పూజారి వివరించారు. అప్పుడు తనకు అనుమానం రాలేదని చెప్పారు.
అనంతరం అమృత్‌పాల్ తనను ఫొన్ అడిగాడని, ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఫొన్ తిరిగిచ్చి వెళ్లిపోయనట్లు పూజారి పేర్కొన్నారు.
జలంధర్ జిల్లాలో పోలీసులు అమృత్‌పాల్‌ను వెంబడించిన తర్వాత అతను ఎటు పోయిన విషయాన్ని పంజాబ్ పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోయారు.