
Secret memo: సిక్కు వేర్పాటువాదులపై చర్యకు భారత్ 'సీక్రెట్ మెమో' జారీ చేసిందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌తో సహా కొంతమంది సిక్కు వేర్పాటువాదులపై 'కఠినమైన' చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం 'సీక్రెట్ మెమో' జారీ చేసిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం సంచనలంగా మారింది.
అయితే ఈ వార్తలపై భారత ప్రభుత్వం స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. 'సీక్రెట్ మెమో'పై మీడియాలో వస్తున్న వార్తలను తప్పుల తడకగా అభివర్ణించారు.
భారతదేశానికి వ్యతిరేకంగా నిరంతర జరుగుతున్న తప్పుడు ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వివరణ
Our response to media queries on reports of MEA "secret memo" in April 2023:https://t.co/LcHTl5HUpf pic.twitter.com/7ilEyqkVDX
— Arindam Bagchi (@MEAIndia) December 10, 2023