LOADING...
Khalistani Groups: వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తాం: ఖలిస్థానీల బెదిరింపులు 
వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తాం: ఖలిస్థానీల బెదిరింపులు

Khalistani Groups: వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తాం: ఖలిస్థానీల బెదిరింపులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్‌లోని భారతీయ కాన్సులేట్‌ను సీజ్ చేయనున్నట్టు, బెదిరించారు. ఈ బెదిరింపుల వెనుక ఖలిస్థానీ సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే సంస్థ ఉంది. వారు వాంకోవర్‌లోని భారతీయ కాన్సులేట్‌ను ముట్టడి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ గురువారం దీని స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయానికి అక్కడికి ఎవరూ రావద్దంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలో, భారత హైకమిషనర్‌ దినేశ్ కె.పట్నాయక్‌ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేసింది. దీంతో ఇది కాస్తా తీవ్ర కలకలం రేపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత హైకమిషనర్‌ పోస్టర్ తో ఖలిస్తానీ లేఖ