Page Loader
ఖలిస్థానీ నేత గురుపత్వంత్ ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఐఏ 
ఖలిస్థానీ నేత గురుపత్వంత్ ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఐఏ

ఖలిస్థానీ నేత గురుపత్వంత్ ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఐఏ 

వ్రాసిన వారు Stalin
Sep 23, 2023
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాకు చెందిన ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన పంజాబ్‌ అమృత్‌సర్‌లోని ఆయన ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం సీజ్ చేసింది. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లాలని ఆయన బెదిరించిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. చండీగఢ్‌లోని పన్నుర్ ఇంటిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. అమృత్‌సర్ జిల్లాలోని ఖాన్‌కోట్‌లో సుమారు 46 కనాల్ వ్యవసాయ ఆస్తులను జప్తు చేసింది. నిషేధిత సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) వ్యవస్థాపకుడైన పన్నూన్.. ఖలిస్థాన్ రెఫరెండం నిర్వహించి భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాద భావాలను ప్రోత్సహిస్తున్నారని ఎన్ఐఏ ఆరోపించింది.

ఖలిస్థానీ

గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ ఎవరు?

పన్నూన్ భారతదేశంలోని పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని ఖాన్‌కోట్ గ్రామంలో జన్మించారు. అతను అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. 2007లో హిందూ నాయకుడి హత్యకేసులో చిక్కుకుని భారత్ నుంచి అమెరికాకు పారిపోయాడు. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సిక్కు దేశాన్ని డిమాండ్ చేస్తూ తీవ్రవాద ఖలిస్థానీ ఉద్యమాన్ని కెనడా వేదికగా పోత్సహిస్తున్నారు. ఖలిస్థానీ తీవ్రవాదానికి అనూకూలంగా SFJ అనే సంస్థను స్థాపించి, ప్రస్తుతం దానికి న్యాయసలహాదరుడిగా ఉన్నారు. 2020లో, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసును కూడా భారత్ ప్రతిపాదించింది. అయితే అతనికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన అభ్యర్థనను ఇంటర్‌పోల్ రెండుసార్లు తిరస్కరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 పన్నూన్ ఇంటిని జప్తు చేస్తూ అంటించిన నోటీసులు