కెనడాలో ఖలిస్థానీ 'వాంటెడ్ టెర్రరిస్ట్' హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హతం
భారత ప్రభుత్వం 'వాంటెడ్ టెర్రరిస్ట్'గా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు. సర్రేలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నిజ్జర్ మరణించాడు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన జాబితాలో 40మంది టెర్రరిస్టుల పేర్లతో నిజ్జర్ పేరు కూడా ఉంది. 2022లో పంజాబ్‌లోని జలంధర్‌లో హిందూ పూజారి హత్యకు కుట్ర పన్నాడని నిజ్జర్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. పూజారి హత్యకు ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) కుట్ర పన్నింది. కెనడాలో ఉన్న నిజ్జర్ కేటీఎఫ్ చీఫ్‌గా ఉన్నారు. గతంలో భారత్‌పై ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నిన కేసులో నిజ్జర్‌పై ఎన్‌ఐఏ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.