Page Loader
ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్ 
ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్

ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్ 

వ్రాసిన వారు Stalin
Sep 30, 2023
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, జాతీయ భద్రత సలహాదారు జాక్ సుల్లివన్‌తో చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడియన్ గడ్డపై ఆ దేశ పౌరుడిని భారత ప్రభుత్వ ఏజెంట్లు హత్య చేశారనే ఆరోపణలపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే కనుమరుగైన ఖలిస్థాన్ సమస్య మళ్లీ తిరిగి రావడానికి మాత్రం కెనడా ఉదాసీనతే కారణం అని జైశంకర్ స్పష్టం చేశారు. హింస, ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని సమర్థించే వారి పట్ల అనుకూలంగా ఉండటం వల్ల ఇది మళ్లీ పునరావృతమైనట్లు ఆయన పేర్కొన్నారు.

జైశంకర్

కెనడాలో వీసాలను అందుకే నిలిపేశాం: జైశంకర్ 

కెనడాలో భారతీయ దౌత్యవేత్తలు సురక్షితంగా లేరని, బహిరంగంగా బెదిరింపులకు గురవుతున్నారని, అందుకే కెనడాలో వీసా కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎస్.జైశంకర్ చెప్పారు. కెనడాలో ఖలిస్థాన్ అనుకూల సెంటిమెంట్‌పై కూడా జైశంకర్ మాట్లాడారు. కెనడాలో ఖలిస్థానీ అనుకూల వాతావరణం అనేది చాలా సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య ఘర్షణ సమస్యగా ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రవాదులు, బహిరంగంగా హింసను సమర్థించే వ్యక్తుల పట్ల కెనడా ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందన్నారు. అందుకే ఖలిస్థానీ కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారిందన్నారు. జూన్ 18న ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ హత్యకు గురైయ్యారు. ఈ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది.