భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. హమాస్ తరహాలో విరుచుకుపడతామని ఖలిస్థానీ ఉగ్రవాది వార్నింగ్
కెనడాలో భారతదేశంపై మరోసారి ఖలీస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఈ మేరకు కెనడా సాకుతో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ భారత్‌ను బెదిరింపులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తుండటం కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉఘ్రవాదులు దాడి ఘటనలో ప్రధాని మోదీ గుణపాఠం నేర్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేకుంటే ఇండియాకు హమాస్ తరహా దాడులు తప్పవని హెచ్చరించాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్‌కు పన్నున్ నేతృత్వం వహిస్తున్నారు. పంజాబ్ నుంచి పాలస్తీనా వరకూ ఆక్రమణకు గురైన వారందరూ ప్రతిఘటిస్తారని, అది మరింత హింసకు దారి తీస్తుందన్నారు. పంజాబ్‌ను ఆధీనంలో ఉంచుకుంటే భారత్ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనికి మోదీనే బాధ్యత వహించాలన్నారు. 'సిక్స్ ఫర్ జస్టిస్' బ్యాలెట్-ఓటును విశ్వసిస్తుందన్నాడు.