Page Loader
భారత్‌తో దౌత్య సంబంధాలు మాకు చాలా కీలకం: కెనడా రక్షణ మంత్రి 
భారత్‌తో దౌత్య సంబంధాలు మాకు చాలా కీలకం: కెనడా రక్షణ మంత్రి

భారత్‌తో దౌత్య సంబంధాలు మాకు చాలా కీలకం: కెనడా రక్షణ మంత్రి 

వ్రాసిన వారు Stalin
Sep 25, 2023
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కెనడా కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. భారత్‌తో సంబంధాలను తాము చాలా కీలకంగా చూస్తున్నట్లు ఆయన న్నారు. నిజ్జర్ హత్యపై విచారణ కొనసాగుతున్నప్పుడు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాలు కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు బ్లెయిర్‌ తెలిపారు. నిజ్జర్ హత్యలో భారత నిఘా వర్గాల హస్తం ఉందన్న ఆరోపణలపై మాత్రం సమగ్ర దర్యాప్తు జరగాలని తమ దేశం కోరుతున్నట్లు స్పష్టం చేసారు. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత బ్లెయిర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజ్జర్

నిజాలను తెలుసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది: బ్లెయిర్‌ 

భారత్‌తో తమ దేశ దౌత్య సంబంధాల విషయంలో నిజ్జర్ హత్యపై విచారణ వ్యవహారం సవాలుతో కూడుకున్న సమస్యగా బ్లెయిర్‌ అభివర్ణించారు. అదే సమయంలో సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలను తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని బ్లెయిర్‌ పేర్కొన్నారు. ఒక వేళ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్త ఉందని రుజువైతే, కెనడా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినందుకు దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. కెనడాకు భారత్‌తో ఇండో-పసిఫిక్ భాగస్వామ్యం ఇప్పటికీ కీలకమైనదిగా తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు సమయంలో ఆ భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు వివరించారు. నిజ్జార్ హత్య నేపథ్యంలో కెనడియన్‌ల వీసా సేవలను భారత్ నిలిపివేసింది. అలాగే ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తుల విషయంలో కెనడా కఠినంగా వ్యవహరించాలని భారత్ కోరింది.