
కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
ముఖ్యంగా కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదుల చర్యల అంశాలన్ని మోదీ లేవనెత్తారు. ఖలిస్థాన్ అనుకూల శక్తులను అదుపు చేయడంలో ట్రూడో సహకారం కావాలని ప్రధాని మోదీ కోరారు.
ఖలిస్థానీలు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, భారతీయ దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నారని, దౌత్య కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని, కెనడాలోని భారతీయ సమాజాన్ని బెదిరిస్తున్నారని, హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ట్రూడో వద్ద మోదీ ఆందోళ వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య విలువలు, చట్టాన్ని గౌరవించడం, ప్రజల మధ్య బలమైన సంబంధాలతో భారత్-కెనడా భాగస్వామ్య బంధం ముడిపడి మోదీ స్పష్టం చేసారు.
ఖలిస్థానీ
పరస్పర గౌరవం లేకుండా బంధాలు బలోపేతం అసాధ్యం: మోదీ
కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఖలిస్థానీ తీవ్రవాద శక్తులకు వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల సిండికేట్‌లు, మానవ అక్రమ రవాణాతో సంబంధాలు ఉండటం కెనడాకు ఇబ్బంది కలిగిస్తుందని ట్రూడో దృష్టికి మోదీ తీసుకెళ్లారు.
విశ్వాసం, పరస్పర గౌరవం లేకుండా బంధాలు బలోపేతం సాధ్యపడదని మోదీ పేర్కొన్నారు. సమావేశం అనంతరం కెనడా మీడియాతో మాట్లాడారు.
తమ దేశం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ, శాంతియుత నిరసన స్వేచ్ఛను ఎల్లప్పుడూ కాపాడుతుందని చెప్పారు.
వాస్తవానికి మొదటి నుంచి కెనడా ప్రభుత్వం ఖలిస్థానీ అనుకూల శక్తుల పట్ల ఉదాసీనంగా వ్వవహరిస్తోంది.
గతంలో సిక్కు జనాభాకు సంబంధించిన వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని గతంలో ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది.