
నిజ్జార్ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కొన్ని వారాల క్రితమే భారత్‌తో పంచుకున్నాం: ట్రూడో
ఈ వార్తాకథనం ఏంటి
ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన ఆధారలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి స్పందించారు.
హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్రకు సంబంధించిన నిర్దిష్టమైన సాక్ష్యాలను భారత ప్రభుత్వంతో కొన్ని వారాల క్రితమే తాము పంచుకున్నట్లు ట్రూడో తెలిపారు.
తాము భారతదేశంతో నిర్మాణాత్మకంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. విచారణలో తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిజ్జర్ హత్యలో కెనడా చేసిన ఆరోపణలు అవాస్తవమని, భారత్ పలుమార్లు ఖండించిన నేపథ్యంలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.
కెనడా
ఫైవ్ ఐ నెట్‌వర్క్ ఇన్‌పుట్స్ ఆధారంగానే కెనడా ఆరోపణలు
జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో నిజ్జర్‌ను హత్య చేయడంలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.
అయితే కెనడా చేసిన ఆరోపణలను భారతదేశం ఖండించింది. అవి 'అసంబద్ధం', 'ప్రేరేపితమైనది' అని తిరస్కరించింది.
ఈ వ్యవహారంలో భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించగా, భారత్ కూడా ఆ దేశ రాయబారిని దేశం విడిచి వెళ్లాలని సమన్లు జారీ చేసింది.
వాస్తవానికి కెనడా తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను అందించనప్పటికీ, తన మిత్ర దేశాల ఫైవ్ ఐ నెట్‌వర్క్ నుంచి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ భారత్‌పై నిందలు వేస్తున్నట్లు తెలుస్తోంది.