Page Loader
Goldy Brar: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం 
Goldy Brar: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

Goldy Brar: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం 

వ్రాసిన వారు Stalin
Jan 01, 2024
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉగ్రవాదిగా ప్రకటించింది. నిషేధిత ఖలిస్థానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో గోల్డీ బ్రార్‌కు సంబంధం ఉందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. గోల్డీ బ్రార్ సీమాంతర ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నాడని, పలువులు హత్య కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది. రాడికల్ భావజాలాన్ని ప్రేరేపించడం, జాతీయవాద అనుకూల నాయకులకు బెదిరింపు కాల్స్ చేయడం, వేర్పాటువాదాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో వివరించింది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు గోల్డీ బ్రార్‌నే బాధ్యత వహించాడు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో మూస్ వాలా కాల్చి చంపబడ్డాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్రం ఉత్తర్వులు జారీ