Page Loader
అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 
అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?

అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 

వ్రాసిన వారు Stalin
Apr 23, 2023
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ పోలీసులను ఇన్ని రోజులు ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్ సింగ్ ఆదివారం అరెస్టు అయ్యారు. అయితే ఆయన నిజంగానే అరెస్టు అయ్యారా? లేక అమృత్‌పాల్ సింగ్ కావాలనే పోలీసులకు లొంగిపోయాడా? ప్రత్యక్ష సాక్షి రోదేవాల్ గురుద్వారా మతాధికారి సింగ్ సాహిబ్ గియానీ జస్బీర్ సింగ్ ఏం చెప్పారు? చాలా రోజులుగా పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్ అనూహ్యంగా పోలీసులకు చిక్కడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమృత్‌పాల్ సింగ్‌ను పక్కా వ్యూహంతో పోలీసులు అరెస్టు చేయలేదని తెలుస్తోంది. తనకు తాను గానే అమృత్‌పాల్ అరెస్టు అయినట్లు రోదేవాల్ గురుద్వారా మతాధికారి సింగ్ సాహిబ్ గియానీ జస్బీర్ సింగ్ చెప్పారు.

పంజాబ్

గురుద్వారాలో భక్తులను ఉద్దేశించి అమృత్‌పాల్ ప్రసంగం 

అమృత్‌పాల్ సింగ్ శనివారం రాత్రి రోదేవాల్ గురుద్వారాకు వచ్చినట్లు మతాధికారి సింగ్ సాహిబ్ గియానీ జస్బీర్ సింగ్ చెప్పారు. అమృత్‌పాల్ అక్కడ ఉన్నట్లు తన ఉనికిని తానే పోలీసులకు తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం7 గంటలకు లొంగిపోయినట్లు చెప్పారు. అరెస్టుకు కొన్ని గంటలు అమృత్‌పాల్ సింగ్ మోగాలోని రోదేవాల్ గురుద్వారాలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించడం గమనార్హం. అమృత్‌పాల్ సింగ్ ఇచ్చిన సంకేతాల మేరకే పోలీసులు మోగాలో అతన్ని చుట్టిముట్టారు. అనతంరం అతన్ని అరెస్టు చేశారు.

పంబాబ్ 

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే అమృతపాల్‌ను చుట్టుముట్టాం: పంజాబ్ ఐజీపీ 

అమృతపాల్ సింగ్‌ అరెస్టుపై పంజాబ్ ఐజీపీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ స్పందించారు. అమృతపాల్ సింగ్‌ను ఆదివారం ఉదయం 6.45 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తాము అతన్ని అరెస్టు చేసేందుకు నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీని మోహరించినట్లు వివరించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మోగాలోని రోడ్ గ్రామంలో అతన్ని అరెస్టు చేసినట్లు ఐజీపీ పేర్కొన్నారు. పోలీసులు చుట్టుముట్టిన తర్వాత అతను పారిపోవడానికి ఎలాంటి దారులు లేవని, ఈ క్రమంలో అతను లొంగిపోక తప్పలేదని పంజాబ్ ఐజీపీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ వెల్లడించారు. అమృత్‌పాల్ అరెస్టు నేపథ్యంలో పోలీసులు పంజాబ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ఎటువంటి నకిలీ వార్తలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయొద్దని పంజాబ్ పోలీసులు కోరారు.

పంజాబ్ 

దేశంలోనే అత్యంత సురక్షితమైనది దిబ్రూఘర్ జైలు

అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన తర్వాత పంజాబ్ పోలీసులు అతన్ని భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుంచి అసోంలోని దిబ్రూఘర్‌ జైలుకు తరలించారు. అమృతపాల్ ప్రధాన అనుచరులు పాపల్‌ప్రీత్ సింగ్, దల్జీత్ సింగ్ కల్సి, భగవంత్ సింగ్ అలియాస్ బజేకే, గుర్మీత్ సింగ్ బుక్కన్వాల్, బసంత్ సింగ్ దౌలత్‌పురా, హర్జిత్ సింగ్, వరీందర్ సింగ్ అలియాస్ ఫౌజీ, వరీందర్ సింగ్, గురిందర్ పాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. 1859-60లో నిర్మించిన దిబ్రూఘర్ జైలును దేశంలోనే అత్యంత సురక్షితమైన జైలుగా అధికారులు భావిస్తున్నారు. ఇది ఈశాన్య ప్రాంతంలోని పురాతన జైలు.