Page Loader
నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత
నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత

నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత

వ్రాసిన వారు Stalin
Apr 01, 2023
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

తాను అవినీతిపరుడినంటూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా పరువు నష్టం కేసు పెడతానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో పాటు ఆప్ రాష్ట్ర యూనిట్ ఆహ్వానం మేరకు కేజ్రీవాల్ ఏప్రిల్ 2న గువాహటికి వెళ్తున్నారు. కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న సమయంలో హిమంత అవినీతికి పాల్పడ్డారని ఇటీవల దిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ ఆరోపించారు. అతను జైలుకు వెళ్లకుండా కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని విమర్శించారు.

హిమంత

కేజ్రీవాల్ పిరికివాడిలా అసెంబ్లీలో మాట్లాడారు: హిమంత

దిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హిమంత స్పందించారు. తనపై ఏదైనా కేసు లేదా ఎఫ్‌ఐఆర్ ఉందా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు పెట్టాలనుకున్నానని, కానీ అతను పిరికివాడిలా అసెంబ్లీ లోపల మాట్లాడారని హిమంత పేర్కొన్నారు. 2వ తేదీన అసోంకు వచ్చాక తనపై కేసులు ఉన్నాయని చెబితే వెంటనే అతనిపై పరువు నష్టం కేసు పెడతానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ నైతికంగా అవినీతిపరుడని హిమంత అన్నారు. 2013లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో దోషులుగా తేలిన చట్టసభ సభ్యులపై తక్షణం అనర్హత వేటు పడకుండా కాపాడేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్‌చించివేశారని శర్మ గుర్తు చేశారు.