Page Loader
ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ 
ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్

ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ 

వ్రాసిన వారు Stalin
Apr 23, 2023
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్‌లోని మోగాలో పోలీసులు అరెస్టు చేశారు. అమృత్‌పాల్ ఇద్దరు సహాయకులను పంజాబ్‌లో మొహాలీలో ఏప్రిల్ 18న పంజాబ్-ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. ఏప్రిల్ 15న పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సన్నిహితుడు జోగా సింగ్‌ను ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌పాల్ మెంటర్ పాపల్‌ప్రీత్ సింగ్‌ను ఏప్రిల్ 10న పంజాబ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అరెస్టు చేసింది. అమృత్‌పాల్ సింగ్ కేసులో పంజాబ్ ప్రభుత్వం ఇప్పటి వరకు 78మందిని అరెస్టు చేసింది.

పంజాబ్

అస్సాంలోని దిబ్రూఘర్‌ జైలుకు అమృత్‌పాల్ తరలింపు

నెల రోజుల క్రితం 'వారిస్ పంజాబ్ దే' చీఫ్‌పై పంజాబ్ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ), నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేశారు. మార్చి 18 నుంచి అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసులు భారీ స్థాయిలో ఆ పరేషన్ చేపట్టారు. రాడికల్ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అస్సాంలోని దిబ్రూఘర్‌ జైలుకు తరలించే అవకాశం ఉందని పంజాబ్ పోలీసు వర్గాలు తెలిపాయి. అమృతపాల్ సింగ్ మెంటర్ పాపల్‌ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేసిన తర్వాత ఏప్రిల్ 11న అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు.