Page Loader
లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు
లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు

లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు

వ్రాసిన వారు Stalin
Apr 20, 2023
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కిరణ్‌దీప్‌ను కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కిరణ్‌దీప్‌కు యూకే పౌరసత్వం ఉంది. అమె యూకే పాస్‌పోర్ట్ హోల్డర్. ఆమెపై పంజాబ్‌లో లేదా దేశంలోని ఏ ప్రాంతంలోనూ కేసు నమోదు కాలేదు. అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ యూకేలో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నట్లు పంజాబ్ పోలీసులు లేదా కేంద్ర ఏజెన్సీల వద్ద కచ్చితమైన ఆధారాలు లేవు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు.

పంజాబ్

ఫిబ్రవరిలో కిరణ్‌దీప్ కౌర్‌- అమృత్‌పాల్ సింగ్ వివాహం

పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చిలో అమృత్‌పాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు. అమృత్‌పాల్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో యూకేకు చెందిన ఎన్నారై కిరణ్‌దీప్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తర్వాత కిరణ్‌దీప్ కౌర్ పంజాబ్‌కు వెళ్లి అమృత్‌పాల్ పూర్వీకుల గ్రామమైన జల్లుపూర్ ఖేడాలో నివసిస్తున్నారు. కిరణ్‌దీప్ కుటుంబ మూలాలు జలంధర్‌లో ఉన్నాయని చెబుతున్నారు. 'వారిస్ పంజాబ్ దే' అధినేతగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల తర్వాత అమృత్‌పాల్‌తో కిరణ్‌దీప్ వివాహం జరిగింది.