Page Loader
అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు
అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు

అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు

వ్రాసిన వారు Stalin
Mar 21, 2023
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్‌కు కోసం పంజాబ్ పోలీలులు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నాలుగు రోజులుగా అమృతపాల్ సింగ్‌ కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో అమృతపాల్‌కు మద్దతుగా ఖలిస్థానీ సానుభూతిపరులు వివిధ దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులు నిరసనలు తెలుపుతున్నారు. అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను ధ్వంసం చేశారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. దిల్లీలోని అమెరికా దౌత్యవేత్త వద్ద భారత తీవ్ర నిరసన తెలిపింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా అమెరికా ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలియజేసింది.

అమెరికా

దౌత్య కార్యాలయాల భద్రత, దౌత్యవేత్తల రక్షణకు కట్టుబడి ఉన్నాం: అమెరికా

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడిని అమెరికా డిపార్ట్‌మెంట్ ప్రతినిధి స్పందించారు. దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. దౌత్య కార్యాలయాల భద్రతతో పాటు, దౌత్యవేత్తల రక్షణ కోసం తాము కట్టుబడి ఉన్నట్లు ప్రతినిధి స్పష్టంచేశారు. లండన్‌లో కూడా ఖలిస్థానీ అనుకూల కార్యకర్తల హైకమిషన్‌లో త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగిన విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఒకరోజు తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలో దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు భారత భద్రతా అధికారులు గాయపడ్డారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా విధ్వంసానికి కారణమైన ఆరుగురు వ్యక్తుల పేర్లను కాన్సులేట్ అధికారులు స్థానిక పోలీసులకు అందించారు. శిరోమణి అకాలీదళ్ అమృత్‌సర్, సిక్కులు ఫర్ జస్టిస్, సిక్కు యూత్ అలయన్స్ గ్రూపులు ఈ నిరసనల వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు.