Page Loader
పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా?
పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా?

పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా?

వ్రాసిన వారు Stalin
Mar 29, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత 10 రోజులుగా పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు అతను గోల్డెన్ టెంపుల్‌లో పోలీసులకు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమృత్‌పాల్ సింగ్ మంగళవారం హోషియార్‌పూర్ మీదుగా అమృత్‌సర్‌కు వెళ్లినట్లు సమాచారం. అమృత్‌సర్‌లో అమృత్‌పాల్ ఉనికి గురించి పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది. అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో అమృత్‌సర్‌లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. గోల్డెన్ టెంపుల్ చుట్టూ, అకల్ తఖ్త్ దగ్గర పోలీసు సిబ్బందిని మోహరించారు. అయితే అమృత్‌పాల్ పోలిసులకు లొంగిపోకుండా అమృత్‌సర్‌ నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.

పంజాబ్

పంజాబ్ పోలీసులు విస్తృత తనిఖీలు

అమృతపాల్ సింగ్, అతని సహాయకులు అమృత్‌సర్‌లో దాక్కున్నారనే సమాచారం నేపథ్యంలో పంజాబ్ పోలీసులు మంగళవారం హోషియార్‌పూర్‌లోని ఒక గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు ప్రారంభించారు. విస్తృతమైన తనిఖీలతో పాటు కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో అమృతపాల్ సింగ్, అతని సహాయకులు మర్నాయన్ గ్రామంలోని గురుద్వారా సమీపంలో తమ వాహనాన్ని వదిలి పారిపోయారు. దీంతో మర్నాయన్ గ్రామాన్ని పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం అర్థరాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.