Page Loader
దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; తలపాగా లేకుండా కళ్లద్దాలు, డెనిమ్ జాకెట్‌తో దర్శనం
దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; సన్‌గ్లాసెస్, డెనిమ్ జాకెట్, తలపాగా లేకుండా దర్శనం

దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; తలపాగా లేకుండా కళ్లద్దాలు, డెనిమ్ జాకెట్‌తో దర్శనం

వ్రాసిన వారు Stalin
Mar 28, 2023
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ నుంచి పారిపోయి వారం రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ దిల్లీలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు. ఫుటేజీలో అమృత్ పాల్ సింగ్ తన తలపాగా లేకుండా కనిపించాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మారువేషంలో కనిపించాడు. అతను సన్ గ్లాసెస్, డెనిమ్ జాకెట్ ధరించాడు. అతని సహాయకుడు పాపల్‌ప్రీత్ సింగ్ కూడా సీసీటీవీ క్లిప్‌లో కనిపించాడు. ఇద్దరూ తమ ముఖం కనపడకుండా మాస్క్‌లు ధరించారు. దిల్లీలో లభించిన సీసీటీవీ ఫుటేజీ మార్చి 21 నాటిది. మార్చి 18న అమృత్ పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు పంజబ్ పోలీసులు ఆపరేషన్‌ను ప్రారంభించగా, మూడు రోజుల తర్వాత ఆయన దిల్లీకి వచ్చినట్లు ఈ సీసీటీవీ పుటేజీ ద్వారా తెలుస్తోంది.

దిల్లీ

కురుక్షేత్ర మీదుగా దిల్లీకి చేరుకున్న అమృత్ పాల్ సింగ్‌

హర్యానాలోని కురుక్షేత్ర మీదుగా అమృత్ పాల్ సింగ్‌, పాపల్‌ప్రీత్‌ సింగ్‌ దిల్లీకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అతను ఇంకా ఢిల్లీలో తలదాచుకున్నాడా? లేదా? అనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు. అమృత్ పాల్ సింగ్‌ నేపాల్‌కు వెళ్లొచ్చనే అనుమానంతో ఇప్పటికే పంజాబ్ పోలీసులు ఇప్పటికే ఆ దేశాన్ని అలర్ట్ చేశారు. ఎందుకంటే అతను నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి సరిహద్దు దాటడానికి ప్రయత్నించవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నటుడు, కార్యకర్త దీప్ సిద్ధూ ప్రారంభించిన "వారిస్ పంజాబ్ దే" అనే రాడికల్ సంస్థకు అమృతపాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు.