అమృత్‌సర్‌కు అమృత్‌పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు
పంజాబ్ నూతన సంవత్సరం 'బైసాఖి' వేడుకలు శుక్రవారం ప్రారంభం కానున్న నేఫథ్యంలో ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ అమృత్‌సర్ లేదా తల్వాండి సాబోను సందర్శించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసులు నిఘా పెంచారు. అమృత్‌పాల్ సింగ్ అమృత్‌సర్‌కు వస్తున్న విషయంపై తమకు సరైన సమాచారం లేదని పంజాబ్ పోలీసులు తెలిపారు. అయితే 'వాంటెడ్'గా ప్రకటించబడిన ఎవరైనా వెంటనే లొంగిపోవాలని అమృత్‌సర్ పోలీసు కమిషనర్ నౌనిహాల్ సింగ్ ఆదేశించారు. లొంగిపోతే అతనిపై చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
రైల్వే స్టేషన్‌లో అమృత్‌పాల్ సింగ్ 'వాంటెడ్' పోస్టర్లు
బైసాఖి వేడుకల నేపథ్యంలో అమృత్‌సర్‌కు వచ్చే యాత్రికుల కోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నౌనిహాల్ సింగ్ చెప్పారు. అమృత్‌పాల్ సింగ్ వస్తాడనే ఊహాగానాల నేపథ్యంలో అమృత్‌సర్‌లోని వివిధ నాకా పాయింట్ల వద్ద పారామిలటరీ బలగాలతో పాటు పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వే పోలీసులు నగరంలోని రైల్వే స్టేషన్‌లో అమృత్‌పాల్ సింగ్ 'వాంటెడ్' పోస్టర్‌లను అంటించారు.