Page Loader
అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్! 
అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!

అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్! 

వ్రాసిన వారు Stalin
Apr 11, 2023
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిఘా వ్యవస్థల కళ్లు గప్పి అతను ఎలా తప్పించుకుంటున్నాడు? అతను అసలు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలను అమృత్‌పాల్ సింగ్‌ సలహాదారుగా చెప్పుకునే పాపల్‌ప్రీత్ సింగ్‌‌ పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. పాపల్‌ప్రీత్ సింగ్‌‌ను సోమవారం పంజాబ్ పోలీసులు అరెస్టు చేసారు. ఇంతకాలం అమృత్‌పాల్ సింగ్‌తో కలసి తను ఎలా తప్పించుకున్నాడనే విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ రైట్ హ్యాండ్‌గా పాపల్‌ప్రీత్ సింగ్‌‌ను చెప్పుకుంటారు. 2022లో అమృత్‌పాల్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చినప్పటి తర్వాత పాపల్‌ప్రీత్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు.

పంజాబ్

రహస్య స్థావరాలపై నోరు విప్పినట్లు పాపల్‌ప్రీత్ సింగ్ 

మార్చి 18న పోలీసులను నుంచి తప్పించుకున్న తర్వాత అమృత్‌పాల్ తాను ఇద్దరు హర్యానా, పాటియాలా, దిల్లీ, పిలిభిత్‌లతో సహా వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు పాపల్‌ప్రీత్ సింగ్ వెల్లడించినట్లు తెలిసింది. పాపల్‌ప్రీత్ సింగ్ కూడా తమ రహస్య స్థావరాలపై నోరు విప్పినట్లు వార్తా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. వారు ప్రయాణంలో ఉన్నప్పుడు కార్లు, బస్సులు, ఇతరుల వాహనాలను ఉపయోగించుకున్నట్లు పాపల్‌ప్రీత్ పోలీసుల విచారణలో చెప్పాడట. ఒకానొక సమయంలో తాము లొంగిపోవాలని భావించామని పాపల్‌ప్రీత్ పేర్కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా, పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న వీడియోలు, ఫోటోగ్రాఫ్‌లు అన్నీ తమవేనని పాపల్‌ప్రీత్ ఒప్పుకున్నట్లు సమాచారం. అమృత్‌పాల్ ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని, మూడు వారాల క్రితం ఇద్దరం పంజాబ్‌లోనే విడిపోయినట్లు పాపల్‌ప్రీత్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.