అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఖలిస్థానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను సోమవారం పంజాబ్ పోలీసులు, పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.
మార్చి 18న పంజాబ్ పోలీసులు వారిస్ పంజాబ్ దేపై భారీ అణిచివేత ప్రారంభించినప్పుడు పోలీసుల నుంచి అమృత్‌పాల్ సింగ్, పాపల్‌ప్రీత్ తప్పించుకు తిరుగుతున్నారు.
అమృత్‌పాల్, పాపల్‌ప్రీత్ వాహనాలను మారుస్తూ కలిసి ప్రయాణించారు. 18వ తేదీన పోలీసుల చేజింగ్ నుంచి తప్పించుకున్నారు. ఐఎస్ఐతో సంబంధాలు నెరపడంలో అమృత్‌పాల్ సింగ్‌కు పాపల్‌ప్రీత్ సింగ్ అత్యంత విశ్వసనీయ సహాయకుడిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దీప్ సిద్ధూ మరణం తర్వాత వారిస్ పంజాబ్ దే పగ్గాలు చేపట్టడంతో అమృత్‌పాల్ సింగ్‌కు మార్గదర్శకత్వం వహించాడు.
Details
అమృత్‌సర్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్న పాపల్‌ప్రీత్
అమృత్‌పాల్ సింగ్ లొంగిపోబోతున్నాడన్న పుకార్లు, బైసాఖీ వేడుకల నేపథ్యంలో పోలీసులు పంజాబ్ అంతటా నిఘా పెంచారు.
పాపల్‌ప్రీత్ అరెస్ట్ నేపథ్యంలో అమృత్‌పాల్ సింగ్ కూడా పంజాబ్‌లోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ పోలీస్ చీఫ్ గౌరవ్ యాదవ్ సోమవారం గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి, చట్టం ప్రకారం ఎవరినైనా పోలీసులు పట్టుకుంటారని, అలాంటి వ్యక్తులు చట్టానికి లొంగిపోవడమే మంచిదని అమృత్‌పాల్ సింగ్‌ను ఉద్దేశించి అన్నారు.
అమృత్‌పాల్ మతపరమైన ప్రదేశంలో ఆశ్రయం పొందవచ్చనే నివేదికల మధ్య, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వ్యక్తిగత కారణాల కోసం మతపరమైన ప్రదేశాలను ఉపయోగించరాదని చెప్పారు.
మత స్థలాలను దుర్వినియోగం చేయరాదని ఆయన పేర్కొన్నారు. వృత్తిరీత్యా పాపల్‌ప్రీత్ అమృత్‌సర్‌కు చెందిన జర్నలిస్ట్. అతను పంజాబ్ షీల్డ్ అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నాడు.