Page Loader
Hindu temple: రెచ్చినపోయిన ఖలిస్థానీలు.. హిందూ దేవాలయంపై భారత వ్యతిరేక రాతలు 
Hindu temple: రెచ్చినపోయిన ఖలిస్థానీలు.. హిందూ దేవాలయంపై భారత వ్యతిరేక రాతలు

Hindu temple: రెచ్చినపోయిన ఖలిస్థానీలు.. హిందూ దేవాలయంపై భారత వ్యతిరేక రాతలు 

వ్రాసిన వారు Stalin
Dec 23, 2023
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి అమెరికాలోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో స్వామినారాయణ్ మందిర్‌పై దాడి చేశారు. ఈ మేరకు అమెరికా హిందూ-అమెరికన్ ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆలయ గోడలపై ఖలిస్థానీ నినాదాలు, భారత వ్యతిరేక నినాదాదాలు రాశారని పేర్కొంది. ఈ ఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణించి పోలీసులు దర్యాప్తు చేయాలని పట్టుబడుతున్నట్లు డిమాండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు కెనడాలో కూడా చాలా సార్లు జరిగాయి. ఇటీవల కెనడాలోని ఖలిస్థాన్ తీవ్రవాదులు సర్రే నగరంలో ఒక ఆలయాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణంపై ప్రజాభిప్రాయ సేకరణ పోస్టర్లను ఆలయ ప్రధాన తలుపుపై ​​అతికించారు. ఈ దృశ్యాలు ఆలయ ప్రాంగణంలో అమర్చిన సీసీటీవీలో కూడా రికార్డైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆలయ గోడలపై రాసిన భారత వ్యతిరేక నినాదాలు